రేపు నల్గొండ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి

TG: సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం నాడు నల్గొండ జిల్లాలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రేపు మ. 3.35 గంటలకు కనగల్ ఏఎంసీ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) రోడ్లకు శంకుస్థాపన చేసి, పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం సా. 4 గంటలకు నల్గొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రూ.83 కోట్ల వ్యయంతో చేపట్టనున్న డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్-1కు శంకుస్థాపన చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్