TG: సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు చేసే సేవలో కేటీఆర్ నిరంతర విజయం సాధించాలని, రాష్ట్ర అభివృద్ధికి ఆయన తన వంతు కృషిని కొనసాగిస్తారని ఆకాంక్షించారు. కేటీఆర్కు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం ఆకాంక్షించారు.