తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేపట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. కాళేశ్వరం అంశంపై ఎక్కడా కేసు పెండింగ్‌లో లేదని, సీబీఐ విచారణకు చట్టపరమైన అడ్డంకులు లేవని సీఎం పేర్కొన్నారు. న్యాయ నిపుణుల సూచనలతో తక్షణమే విచారణ చేపట్టేలా సీబీఐకి లేఖ రాయాలని, అవసరమైతే సీబీఐ డైరెక్టర్‌ను కలవాలని మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.