TG: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ అధికారులకు కీలక సూచనలు చేశారు. పనులు వేగంగా జరగకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక అధికారులతో పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు.