సీఎం రేవంత్ బినామీ కంపెనీకి రూ.6 వేల కోట్ల పనులు: KTR

TG: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ‘KLSR అనేది సీఎం రేవంత్ బినామీ కంపెనీ. రేవంత్ వాడుతున్న కారు కూడా ఈ సంస్థ పేరు మీదే ఉంది. 2018లోనే ఈ కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. 2023లో దివాళా తీసింది. వాళ్ల దగ్గర సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకూ డబ్బులు లేవు. అలాంటి కంపెనీకి రూ.6వేల కోట్ల కాంట్రాక్టులు ఎలా ఇచ్చారు? ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చింది’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్