TG: బీఆర్‌ఎస్‌కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను నిలిపివేసి మోటార్లకు మీటర్లు పెడితే తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని అన్నారు. ఒకవేళ ఉచిత విద్యుత్ కొనసాగిస్తే బీఆర్‌ఎస్ ఎన్నికలకు దూరంగా ఉంటుందా? అని ప్రశ్నించారు. అన్నదాతలకు 24 గంటల నాణ్యమైన కరెంట్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జవాబుదారీతనంతో కూడిన ‘రైతు డిస్కం’ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.