ఈ నెల 19 నుంచి సీఎం రేవంత్ దావోస్‌ పర్యటన

TG: ఈ నెల 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పర్యటించనున్నది. ‘ఏ స్పిరిట్‌ ఆఫ్‌ డైలాగ్‌’ అనే థీమ్‌తో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సు వేదికగా ఆయన ప్రయత్నించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2025 ద్వారా వచ్చిన దాదాపు 5.75 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను, అలాగే గత రెండు దావోస్‌ పర్యటనల ఒప్పందాలను శుక్రవారం సీఎం సమీక్షించారు.

సంబంధిత పోస్ట్