TG: సీఎం రేవంత్ రెడ్డి MCHRD గ్రౌండ్‌లో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాళ్లతో కలిసి మ్యాచ్ ఆడారు. ఈ నెల 13న HYDలోని ఉప్పల్ స్టేడియంలో అర్జెంటీనా స్టార్ మెస్సీతో జరిగే ఫుట్ బాల్ మ్యాచ్ కోసం సీఎం డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా జరగనున్న మ్యాచులో RR-9 టీమ్ తరఫున రేవంత్ 9వ నంబర్ జెర్సీలో, LM-10 జట్టు తరఫున మెస్సీ 10వ నంబర్ జెర్సీలో బరిలోకి దిగనున్నారు.