గత ప్రభుత్వం ప్రజాస్వామ విలువలను పాటించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. 'అజ్ఞానమే గొప్ప విజ్ఞానం అనుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగం గాంధీభవన్‌లో కార్యకర్త ప్రసంగంలా ఉందని కొందరు అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. గవర్నర్‌ను గౌరవించే బాధ్యత మాది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశాం. వాటినే గవర్నర్ ప్రస్తావించారు. మార్చి 31వ తేదీ నాటికి రైతు భరోసా అందిస్తాం' అని అన్నారు.