రేపు ‘ఫ్యూచర్ సిటీ’లో సీఎం రేవంత్ పర్యటన.

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి రేపు ఫ్యూచర్‌ సిటీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో మధ్యాహ్నం 3.30 గంటలకు నూతన ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీని సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తారు. ఫ్యూచర్‌ సిటీలో ఏర్పాటు చేయనున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యునానీ మెడిసిన్‌ (ఎన్‌ఐయూఎం) నూతన క్యాంపస్‌కు భూమిపూజ చేసి శంకుస్థాపన చేయనున్నారు. పర్యటన చివరలో ఫ్యూచర్‌ సిటీ మాస్టర్‌ ప్లాన్‌, మౌలిక వసతులు, కనెక్టివిటీ, భవిష్యత్‌ అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕