TG: సీఎం రేవంత్ రెడ్డి నేడు కేరళంలో పర్యటించనున్నారు. వచ్చే నెలలో కేరళం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు. ఈ మేరకు రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున తెలంగాణ సీఎం రేవంత్ ప్రచారం చేయనున్నారు. కాగా రేవంత్ రెడ్డిని కేరళం ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్‌గా కాంగ్రెస్ పార్టీ నియమించిన విషయం తెలిసిందే.