వరద బాధితులతో మాట్లాడిన సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్‌ రెడ్డి వరంగల్‌లో పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేసిన సీఎం.. సమ్మయ్యనగర్‌లో వరద బాధితులతో మాట్లాడారు. రోడ్డు మార్గంలో హన్మకొండ చౌరస్తా, కాపువాడ, భద్రకాళి ఆలయం మీదుగా పోతననగర్‌లో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. పోతన నగర్‌ దగ్గర ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడి వినతులు తీసుకున్నారు. కాసేపట్లో హన్మకొండ కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు.

సంబంధిత పోస్ట్