TG: మూసీ నది పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా మంచిరేవుల వద్ద భారీ ఎత్తున ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం చేపట్టునున్నారు. ఈ పనులకు శనివారం సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఆలయ నిర్మాణానికి సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పటికే డిజైన్లను ఖరారు చేసింది. సుమారు రూ.700 కోట్లతో 8 ఎకరాల్లో ఈ నిర్మాణం జరగనుండగా.. 100 అడుగుల గాలి గోపురం, మూసీ నది మధ్యలో 100 అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు.