స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు సీఎం రేవంత్ సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో కీలక సమావేశం జరగనుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ సర్కార్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉంది.

సంబంధిత పోస్ట్