ఉరితీయాలన్న సీఎం రేవంత్.. హరీశ్ రావు ఫైర్

TG: కేసీఆర్, హరీశ్ రావును ఉరితీసినా తప్పులేదని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు మండిపడ్డారు. 'తెలంగాణను సాధించిన మహనీయుడిని కసబ్‌తో పోల్చిన నీకు సంస్కారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదు. సభకు వస్తే కేసీఆర్‌ను అవమానించబోమని చెబుతూనే కసబ్‌తో పోల్చుతావా? నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం రేవంతు నైజం. నీకు తెలిసిందళ్లా అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగం' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్