TG: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే 1) సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో కార్మికులే కీలకమని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమాను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,000 బోనస్, బ్యాంకుల సహకారంతో కార్మికులకు రూ.1 కోటి బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు వెల్లడించారు.