వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయ పనుల పురోగతిపై CM సమీక్ష

TG: వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల పనుల పురోగతిపై CM రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలవాలని, కాకతీయ కళాతోరణం, పిల్లలమర్రి, రామప్ప ఆలయం వంటి వాటిని ప్రతిబింబించేలా డిజైన్లు ఉండాలని అధికారులకు సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణ డిజైన్లను కూడా పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕