మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ చిన్న కుమారుడు అభిమన్యు యాదవ్, ఇషితా యాదవ్ సామూహిక వివాహ వేడుకల్లో అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. సాధారణ ఎమ్మెల్యే కుమారుడి వివాహాలు కూడా కోట్ల రూపాయలు ఖర్చుతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కాలంలో, సీఎం కుమారుడు ఆదర్శంగా నిలిచారు. ఈ వివాహం చాలా మందికి స్ఫూర్తిదాయకంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.