తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సీఎం విజయ్, తనకు ఓట్లు వేసి గెలిపించిన తిరుచ్చి తూర్పు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సోమవారం తిరుచ్చిలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం చెన్నై నుంచి బయలుదేరి, సాయంత్రం 4 గంటలకు తిరుచ్చి చేరుకుంటారు. ఎయిర్‌పోర్ట్ నుంచి జోసెఫ్ కాలేజ్ గ్రౌండ్ వరకు 13 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం మంత్రులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భద్రత కోసం 1,000 మందికి పైగా పోలీసులను మోహరించారు.