తమిళనాడు సీఎం విజయ్ భవిష్యత్‌లో ప్రధాని అయ్యే అవకాశం ఉందని ప్రముఖ నటుడు జేఎం బషీర్ జోస్యం చెప్పారు. TVK ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని, విజయ్ మంచి పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు. దివంగత మాజీ సీఎం ఎంజీఆర్ జీవిత చరిత్రపై 'పురట్చితలైవర్ MGR' పేరుతో రాబోతున్న సినిమా ఈవెంట్‌లో బషీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో జయలలిత పాత్ర కోసం హీరోయిన్ త్రిషను సంప్రదించినట్లు చెప్పారు.