ముంబయిలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ భేటీ అయ్యారు. తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మాణం అంశంపై సమావేశం ప్రారంభమైంది. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఉన్నారు. 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం తెలపాలని సీఎం రేవంత్ మహారాష్ట్రను కోరనున్నారు.