తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే చోట కలిసి కనిపించారు. హైదరాబాద్‌లోని RFCలో జరుగుతున్న 'రామోజీ ఎక్స్‌లెన్స్' జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పక్కపక్కనే కూర్చున్న ఇద్దరు సీఎంలు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.