హిందూ మహాసముద్రంలో చిక్కుకున్న ఇద్దరు విదేశీయులను భారత తీర రక్షక దళం సురక్షితంగా రక్షించింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని ఇందిరా పాయింట్‌కు 52 నాటికల్ మైళ్ల దూరంలో ఓ అమెరికన్ యాట్ నుంచి చెన్నై యూఎస్ కాన్సులేట్‌కు అత్యవసర సందేశం చేరింది. వెంటనే స్పందించిన కోస్ట్‌గార్డ్.. రాజ్‌వీర్ నౌకతో యాట్ వద్దకు వెళ్లి అందులో ఉన్న అమెరికా, తుర్కియే దేశాలకు చెందిన ఇద్దరిని సురక్షితంగా రక్షించింది.