గుజరాత్ తీరంలో రూ.1150 కోట్ల కొకైన్ సీజ్

గుజరాత్ సమీపంలో భారత కోస్ట్ గార్డ్, యాంటీ టెర్రిరిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.1,150 కోట్ల విలువైన 115 కిలోల కొకైన్ సీజ్ చేశారు. దక్షిణ అమెరికా నుండి పాకిస్తాన్ మీదుగా అక్రమంగా తరలిస్తున్న ఈ డ్రగ్స్ కన్సైన్‌మెంట్‌కు సంబంధించి ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ ఏటీఎస్, కేంద్ర దర్యాప్తు సంస్థలు నిందితుడిని విచారిస్తున్నాయి. డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌పై కచ్ తీర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

సంబంధిత పోస్ట్