ఇద్దరి ప్రాణాలు తీసిన కొబ్బరి బొండం

AP: ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రాజమహేంద్రవరానికి చెందిన పురోహితుడు దువ్వురి హరిప్రసాద్ హైదరాబాద్‌లో పెళ్లి కార్యక్రమం ముగించుకుని కారులో తిరుగు ప్రయాణంలో ఉండగా, గొల్లపూడి బైపాస్ వద్ద కారు అదుపుతప్పి ముందున్న ద్విచక్ర వాహనాన్ని, అనంతరం కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఘటనాస్థలిలో హరిప్రసాద్‌తో పాటు బైక్‌పై ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మృతి చెందారు. కారు బ్రేక్, క్లచ్ పెడల్స్ మధ్య కొబ్బరిబొండం ఇరుక్కుపోవడంతో బ్రేకులు పనిచేయక ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్