వేసవి తాపాన్ని తట్టుకోవడానికి కొబ్బరి నీళ్లు ఉత్తమమైన పానీయం. ఇవి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, వడదెబ్బ నుంచి కాపాడతాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా, చర్మవ్యాధులను నయం చేయడంలోనూ ఇవి సహాయపడతాయి. జీర్ణక్రియకు, రక్త ప్రసరణకు కూడా ఇవి మేలు చేస్తాయి.