ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్, రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా దాదాపు 4వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. 'ప్రాజెక్ట్ లీప్' పేరుతో చేపట్టిన ఈ ప్రక్షాళన వెనుక AI వైపు మళ్లడం, ఖర్చులను తగ్గించుకోవడం ప్రధాన లక్ష్యాలు. తొలగించిన ఉద్యోగులకు పరిహారం కోసం కంపెనీ సుమారు 270 మిలియన్ డాలర్లు (రూ.2,430 కోట్లు) కేటాయించింది. ఈ లేఆఫ్స్ ప్రధానంగా మిడ్-లెవల్ టెక్కీలపై ప్రభావం చూపనున్నాయి. కంపెనీ సీఈఓ ఎస్. రవికుమార్ నేతృత్వంలో జరుగుతున్న ఈ చర్యల వల్ల ఏడాదికి సుమారు రూ.2,700 కోట్లు ఆదా అవుతాయని అంచనా.