వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు చల్లటి నీళ్లు, ఐస్‌క్రీమ్‌లు ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల సైనస్, ఆస్తమా, దీర్ఘకాలిక జలుబు, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఫ్రిజ్ వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియ మందగించడం, గొంతు నొప్పి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయని, ఇది ఆయుర్వేదం ప్రకారం జీర్ణక్రియను బలహీనపరుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో కుండలోని నీరు లేదా సాధారణ నీరు తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని సూచిస్తున్నారు.