35 మందికి రైతు భరోసా నిలిపివేసిన కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించిన 35 మంది రైతులకు ప్రభుత్వం అందించే రైతు భరోసా సాయాన్ని నిలిపివేస్తూ కలెక్టర్ కె.హరిత నిర్ణయం తీసుకున్నారు. సోమవారం కలెక్టరేట్​లో జరిగిన జిల్లాస్థాయి మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, గంజాయి సాగు చేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు, బస్సుల తనిఖీలను ముమ్మరం చేయాలని, డ్రగ్స్​ దుష్ప్రభావాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్