జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హంద్వారాలో కాలేజీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా.. మరో 23 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.