AP: తిరుపతిలోని శ్రీ వికాస్ నర్సింగ్ కాలేజీలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఫీజు ఆలస్యమైందని ఓ విద్యార్థినితో బాత్రూంలు కడిగించడమే కాకుండా మూడు రోజుల పాటు ‘గోడ కుర్చీ’ వేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే మొదటి ఏడాది రూ.2 లక్షలు చెల్లించినప్పటికీ వేధింపులు కొనసాగాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు కాలేజీ వద్ద ఆందోళన చేపట్టి, యాజమాన్యంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి.