శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే పెద్ద ప్రేగు ఆరోగ్యం ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను నివారించడానికి పీచు పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 3-4 లీటర్ల నీరు తాగడం, ప్రోబయోటిక్ ఆహారాలు, రోజుకు 30 నిమిషాల వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. జంక్ ఫుడ్, వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం వంటి సూత్రాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తేలికపాటి రాత్రి భోజనం, సమయానికి విసర్జన వంటివి ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.