సూర్య తన హైట్ గురించి తనే కామెంట్స్ చేశారు. ‘కంగువా’ సినిమాలో ఎత్తుగా ఉన్న బాబీ డియోల్‌తో యుద్ద సన్నివేశాల్లో నటించడానికి తనకు మానసికంగా ఇబ్బంది అయిందని పేర్కొన్నారు. దీనిపై బాబీ డియోల్ స్పందించారు. ‘భౌతికంగా సూర్య తక్కువ ఎత్తులో ఉండొచ్చని, కానీ ఓ నటుడిగా అతడు ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడని మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.