నటుడు విజయ్, నటి త్రిషల ఫోటోపై అనుచిత వ్యాఖ్యలు చేసిన DMK ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ...'తాను రాజకీయాల్లో ఇలా ఇరుక్కుపోయానని విజయ్ బాధపడుతూ ఉంటారు. ఇంట్లో నటి (త్రిష)తో ఎంతో సంతోషంగా ఉండేవాడినని గుర్తుచేసుకున్నారేమో?' అని అనితా రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.