దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ (19 కేజీలు) ధరను కంపెనీలు భారీగా పెంచాయి. ఒకేసారి రూ.993 పెంచడంతో ఢిల్లీలో దీని ధర రూ.3,071కు చేరింది. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,069గా ఉంది. అయితే గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయి.