పెట్రోల్, డీజిల్ పై ఫిర్యాదులు.. 1967 నంబర్‌కు కాల్ చేయండి: ఉత్తమ్

TG: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ సూచించారు. పుకార్ల కారణంగనే ప్రజలు కావాల్సిన దాని కంటే ఎక్కువగా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి వివరించారు. పెట్రోల్, డీజిల్ కొరత.. బ్లాక్ మార్కెట్‌లకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే 1967 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని మంత్రి తెలిపారు. 24 గంటలు పనిచేయాలని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలను కోరినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్