జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పూజా మందిరంలో శంఖాన్ని ఉంచడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహించి, శాంతి, ఐశ్వర్యం పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు. దీనిని ఈశాన్య దిశలో ఉంచి, అందులో పవిత్రమైన నీటిని నింపాలి. శంఖాన్ని ఎరుపు లేదా తెలుపు వస్త్రంపై ఉంచాలి. రోజుకు రెండుసార్లు శంఖాన్ని ఊదడం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. దక్షిణావర్తి శంఖాన్ని లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో ఉంచుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.