ఆర్టీసీ బస్సులో మహిళలను బూతులు తిట్టిన కండక్టర్ (వీడియో)

TG: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ డిపోకు చెందిన 218H నంబర్ గల ఆర్టీసీ బస్సులో ఓ కండక్టర్ మహిళలతో అసభ్య పదజాలం ఉపయోగించి, వేలు చూపిస్తూ బెదిరింపులకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. మహిళలు ప్రశ్నించడంతో మరింత దురుసుగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్