బస్సు ఎక్కబోతుంటే కాలితో తన్నిన కండక్టర్.. సస్పెండ్ చేసిన అధికారులు!

బెంగళూరులో బస్సు ఎక్కబోతున్న ఒక వ్యక్తిని కండక్టర్ కృష్ణమూర్తి కాలితో తన్ని కిందికి తోసేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు కండక్టర్‌ను సస్పెండ్ చేశారు. బాధితుడు భిక్షాటన చేసే వ్యక్తి అని, అతడిని రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయారని సమాచారం. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్