TG: మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళిక మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులతో జరిగిన వివాదంలో బస్సు టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడిన ప్రవళికకు హైదరాబాద్లోని సాయి సంజీవని ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించామని వెల్లడించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ.. ప్రవళిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ అన్ని విధాలా అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.