ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్‌ఇండియాకు ఐసీసీ ఛైర్మన్ జైషా అభినందనలు తెలిపారు. ‘‘కంగ్రాట్స్ టీమ్‌ఇండియా.. అద్భుతం చేశారు. దేశం కోసం పోటీ పడిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. నయోగ, జపాన్ చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయమని అన్నారు. ఆసియా క్రీడల నిర్వాహకులు, ప్రేక్షకులకు జైషా కృతజ్ఞతలు తెలిపారు.