BRS పార్టీపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏ రాజ్యాంగం చెప్పిందని 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకున్నారని ప్రశ్నించారు. పదవులు ఆశ చూపి కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు.. అప్పుడు కూడా ఇవే చట్టాలు ఉన్నాయి కదా? అంటూ విమర్శించారు. ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ లో పడుకోవాలని ఏ చట్టం చెప్పింది? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.