తమిళనాడులో TVK పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిందని ఆ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం ప్రకటించారు. మీడియాతో మాట్లాడుతూ.. టీవీకేకు 108 సీట్లు వచ్చాయని, తమిళ ప్రజలు ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. మెజారిటీ కోసం టీవీకే తామను సంప్రదించగా.. సపోర్ట్ చేస్తామని చెప్పామన్నారు. తమిళనాడులో సెక్యులర్, సుస్థిర ప్రభుత్వం రాబోతోందని తెలిపారు.