టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఇవాళ గవర్నర్‌ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు గాను రెండు మంత్రి పదవులు అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై నేడు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా రేపు విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరవనున్నట్లు సమాచారం.