TG: కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బూత్ లెవెల్ ఏజెంట్లే పార్టీకి నిజమైన మూలస్తంభాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో ఆదివారం జరిగిన బిఎల్ఏల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. గత 10 ఏళ్లలో మధిర నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని, ఆ 10 సంవత్సరాల అభివృద్ధిని, ఈ 5 ఏళ్ల నాటి అభివృద్ధిని ఈ ఐదేళ్లలోనే కాలంతో పోటీపడి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.