తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలను కాంగ్రెస్, BRS అస్త్రాలుగా వాడుకుంటున్నాయని MP లక్ష్మణ్ మండిపడ్డారు. BC రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉందని చెప్పారు. దానిని తేల్చకముందే ఆర్డినెన్స్ తీసుకురావడంలో మతలబు ఏంటి? అని ప్రశ్నించారు. కేంద్రంపై నిందలు వేసేందుకు రేవంత్ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కోసం మంత్రి వర్గం తీర్మానం చేయడం బీసీలను వంచించడమేనని చెప్పారు.