సీఈసీ ఫొటో ఉన్న దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్

ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ సభ్యులు వినూత్నంగా నిరసన చేపట్టారు. రావణుడి దిష్టిబొమ్మ స్థానంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ఫొటోను పెట్టి, దానిని దహనం చేశారు. ఈ నిరసనకు 'జ్ఞానేష్ బ్రో లంకా దహనం' అని పేరు పెట్టారు. సీఈసీ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనకు సంబంధించిన వీడియోను యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎన్నికల కమిషన్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕