TG: కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు పట్టాలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు భూములు తీసుకుంటున్నారని ఆరోపించారు. బహదూర్‌గూడ రైతుల సమస్య గతంలో KCR దృష్టికి తెచ్చి ఉంటే.. 10 నిమిషాల్లో పరిష్కరించేవారన్నారు. బహదూర్‌గూడ భూములు ప్రభుత్వానివి అయితే.. పోలీసుల పహారా ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు.