తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌పై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మోదీ ఫొటోలతో ఉన్న శ్రీరాముడి క్యాలెండర్లను ఓటర్లకు పంచారని ఆరోపించారు. ఆయనను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఈసీని కోరారు.