ఢిల్లీలో కాంగ్రెస్‌ దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశం

ఢిల్లీలోని కాన్‌స్టి్ట్యూషన్‌ క్లబ్‌లో ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో కాంగ్రెస్ దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరైన స్థలాన్ని శుద్ధికరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల నుంచి నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఖర్గేను బీజేపీ అవమానించిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్

✕
✕